ఏపీలో భారీ వర్షాలు, వరదలు.. జనసేన కార్యకర్తలకు పవన్ కల్యాణ్ పిలుపు!
- సహాయ చర్యల్లో పాల్గొనాలని పవన్ ఆదేశం
- ముంపు ప్రాంతాల ప్రజలకు అండగా నిలవాలని సూచన
- సహాయ చర్యల్ని ప్రభుత్వం ముమ్మరం చేయాలని డిమాండ్
ఈరోజు భీమవరంలో పార్టీ శ్రేణులతో సమావేశమైన పవన్ మాట్లాడుతూ.. వరద సహాయక చర్యల్లో పాల్గొనాలని జనసేన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జనసేన శ్రేణులు పోలవరం ముంపు ప్రాంతాల్లో పర్యటించాలనీ, అక్కడి ప్రజలకు అండగా నిలవాలని కోరారు. ముంపు ప్రాంతాల్లో ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేయాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.