వరద బాధితులకు అండగా నిలవండి.. టీడీపీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు!
- సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొనండి
- ప్రజలు తాగునీరు లేక ఇబ్బంది పడుతున్నారు
- ప్రభుత్వం వెంటనే సహాయక చర్యల్ని ముమ్మరం చేయాలి
ఓవైపు విద్యుత్ కోతలు, మరోవైపు స్వచ్ఛమైన తాగునీరు లేక ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. భారీ వర్షాల కారణంగా మిర్చి, అరటి, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయనీ, తీవ్రమైన నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. పలు మార్గాల్లో రోడ్లు తెగిపోయి రవాణా స్తంభించిపోయిందని గుర్తుచేశారు. ప్రభుత్వం వెంటనే సహాయక చర్యల్ని ముమ్మరం చేయాలని డిమాండ్ చేశారు.