విమానంలో గబ్బిలం చక్కర్లు.. హడలిపోయిన ప్రయాణికులు!
- అమెరికాలోని నార్త్ కరోలినాలో ఘటన
- విమానంలో దూరిన గబ్బిలం
- వాష్ రూముల్లో దాక్కున్న ప్రయాణికులు
దీన్ని చూసిన పలువురు ప్రయాణికులు హడలిపోగా, ఇంకొందరు వాష్ రూమ్ లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. ఈ తతంగాన్ని ఓ ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కాగా, స్పిరిట్ ఎయిర్ లైన్స్ తీరుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాదిలో స్పిరిట్ విమానాల్లో గబ్బిలాలు కనిపించడం ఇది రెండోసారనీ, ఇకపై జీవితంలో స్పిరిట్ విమానయాన సంస్థ విమానాలు ఎక్కబోనని ఓ ప్రయాణికుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు.