ఓ నవలా నాయకుడి పేరుతో ఫేస్ బుక్ చాటింగ్ చేసిన నీరవ్ మోదీ
- ఎడ్మండ్ డాంటెస్ పేరుతో ఫేక్ ఐడీ క్రియేట్ చేసిన నీరవ్
- స్నేహితురాలు గ్లోరియాతో చాటింగ్
- బహమాస్ లో తాత్కాలిక సంస్థకు నవల పేరు
ఎడ్మండ్ డాంటెస్ అనేది 'ది కౌంట్ ఆఫ్ మాంటే క్రిస్టో' అనే సుప్రసిద్ధ ఫ్రెంచి నవలలో కథానాయకుడి పేరు. ఈ నవల 1844లో వచ్చింది. ఈ పుస్తకం అంటే తనకు ఎంతో ఇష్టమని నీరవ్ మోదీ గతంలో ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. అంతేకాదు, అక్రమార్కులకు స్వర్గధామం అనదగ్గ బహమాస్ లో కూడా మాంటే క్రిస్టో వెంచర్స్ పేరుతో ఓ తాత్కాలిక సంస్థను స్థాపించాడు. ఇక, ఎడ్మండ్ డాంటెస్ ఐడీతో ఫేస్ బుక్ లో మార్సికా అట్మోడిమెజ్జో అనే వ్యక్తికి కూడా మెసేజ్ లు పంపినట్టు తెలిసింది.