నేడు ప్రకాశం జిల్లాలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పర్యటన!
- మధ్యాహ్నం 3 గంటలకు ఒంగోలుకు చేరుకోనున్న మంత్రి
- రాత్రికి అక్కడే బస
- ఆదివారం తిరుపతికి ప్రయాణం
అనంతరం కారులో చీమకుర్తికి బయలుదేరుతారు. చీమకుర్తిలోని ఓ కల్యాణ మండపంలో ఆర్యవైశ్య సంఘం ఏర్పాటు చేసిన పౌర సంగమం కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడే మధ్యాహ్న భోజనం చేసి తిరుపతికి రోడ్డు మార్గంలో వెళతారు. రాత్రికి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అక్కడే బస చేస్తారు. ఈ పర్యటనకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఏపీ దేవాదాయ శాఖ ఓఎస్డీ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు.