మిస్ ఇంగ్లాండ్ అందాల పోటీల్లో టైటిల్ గెలిచిన భారత అమ్మాయి... అమ్మడు చాలా స్పెషల్!
- మిస్ ఇంగ్లాండ్ విజేతగా బాషా ముఖర్జీ
- బాషాకు రెండు మెడికల్ డిగ్రీలు
- ఐదు భాషల్లో అనర్గళంగా మాట్లాడగల బాషా
ఆమె 5 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలదు. ఒక మెడికల్ డిగ్రీ సంపాదించడమే చాలా కష్టమైన నేపథ్యంలో, అమ్మడు రెండు మెడికల్ డిగ్రీలు సాధించింది. అన్నింటికంటే ముఖ్యంగా, ఈ భారత సంతతి యువతి ఐక్యూ స్థాయి 146 కావడం విశేషం. బాషాకు పదేళ్ల వయసు ఉన్నప్పుడు ఆమె కుటుంబం బ్రిటన్ వలస వెళ్లింది. ఆమె విద్యాభ్యాసం అంతా అక్కడే సాగింది. మెడిసిన్ చదువుతున్నప్పుడే అందాల పోటీల్లోనూ పాల్గొనాలని నిశ్చయించుకుని అన్నివిధాలుగా సంసిద్ధమైంది.