పీవీపీ ఆస్తులను వేలం వేయనున్న కెనరా బ్యాంకు!
- బ్యాంకుకు చెల్లించాల్సింది రూ. 148.90 కోట్లు
- చెన్నై సమీపంలోని స్థలం వేలం
- ప్రకటనలో తెలిపిన కెనరా బ్యాంకు
కాగా, పీవీపీ కేపిటల్ 2003లో బ్యాంకు నుంచి ఈ రుణాన్ని తీసుకోగా, దానికి పొట్లూరితో పాటు ఆయన భార్య ఝాన్సీ ష్యూరిటీ ఇచ్చారు. వారి మరో సంస్థ పీవీపీ వెంచర్స్ లిమిటెడ్ కూడా కార్పొరేట్ హామీదారుగా ఉండేందుకు అంగీకరించింది. ఇప్పుడిక రుణం వసూలు కోసం చెన్నై సమీపంలోని పెరంబూరు గ్రామంలో సంస్థ పేరిట ఉన్న దాదాపు 24,355.29 చదరపు మీటర్ల భూమిని వేలం వేస్తున్నట్లు బ్యాంకు అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు.