శంషాబాద్ ఎయిర్ పోర్టు వద్ద.. బిడ్డల కిడ్నాప్ యత్నం ... వెంటాడి పట్టుకున్న తల్లిదండ్రులు!
- హైదరాబాద్ ఎయిర్ పోర్టులో ఘటన
- ముంబై నుంచి వచ్చిన కుటుంబం
- పిల్లలున్న క్యాబ్ తో పారిపోయేందుకు యత్నించిన డ్రైవర్
పెద్దలు ఓ క్యాబ్ లో, పిల్లలు మరో క్యాబ్ లో ఎక్కగా, పిల్లలున్న క్యాబ్ తో పారిపోయేందుకు క్యాబ్ డ్రైవర్ ప్రయత్నించాడు. క్యాబ్ దారి మళ్లిందని గుర్తించిన తల్లిదండ్రులు, కారును వెంటాడి పట్టుకున్నారు. ఈలోగా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారూ రంగంలోకి దిగారు. దాదాపు 5 కిలోమీటర్ల దూరం ఛేజింగ్ అనంతరం ఆ కారును నిలువరించి, డ్రైవర్ ను పోలీసులకు అప్పగించారు.