దేవుడా... ఏం గజినీ మెమరీ ఇచ్చావు తండ్రి: పీవీపీ

తెలుగుదేశం పార్టీ నేత, ఎంపీ కేశినేని నాని, అతనిపై పోటీ పడి ఓటమి పాలైన వైసీపీ నేత పీవీపీ (పొట్లూరి వరప్రసాద్) ల మధ్య సోషల్ మీడియా వేదికగా వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ రాజకీయ ప్రత్యర్థులు నిత్యమూ తమతమ ట్వీట్లతోనే యుద్ధం చేస్తున్నారు. తాజాగా పీవీపీ ఆస్తుల వేలం గురించి కేశినేని ట్వీట్ చేయగా, ఆ వెంటనే పీవీపీ స్పందించారు.

టీడీపీ మేనిఫెస్టోపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ, ప్రతి జిల్లాలో 80 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇస్తామని నాడు టీడీపీ మేనిఫెస్టోలో పేజీ నంబర్ 23లో చెప్పారంటూ గుర్తు చేశారు. "దేవుడా, మన మాజీ సీఎం, ఎంపీలకు గజినీ మెమరీ ఇచ్చావు తండ్రి !వీరు పరమానందయ్య శిష్యులు కాదు.. అలీబాబా మరియు అరవై దొంగలు..." అని కామెంట్ చేశారు పీవీపీ.
Go Back to Shorts
Kesineni Nani
PVP
Telugudesam
YSRCP
Twitter

More Telugu News