వైయస్ ఉద్యోగాలిచ్చి అన్నం పెట్టారు... జగన్ మాత్రం పొట్టగొడుతున్నారు: కన్నా లక్ష్మీనారాయణ

దివంగత వైయస్ రాజశేఖరెడ్డికి, ముఖ్యమంత్రి జగన్ కు పోలిక లేదని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. వైయస్ ఉద్యోగాలిచ్చి అన్నం పెట్టారని... జగన్ మాత్రం జనాల పొట్టగొడుతున్నారని విమర్శించారు. ఫీల్డ్ అసిస్టెంట్లకు వైయస్ ఉద్యోగావకాశాలను కల్పిస్తే... జగన్ వారికి మంగళం పలుకుతున్నారని అన్నారు. రాజన్న పాలనను మళ్లీ తెస్తామని చెప్పుకున్న జగన్... క్షేత్ర స్థాయిలో మాత్రం దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజావ్యతిరేక విధానాలను జగన్ అవలంబిస్తే బీజేపీ పోరాటం చేస్తుందని తెలిపారు. టీడీపీ, జనసేన నుంచే కాకుండా వైసీపీ నుంచి కూడా బీజేపీలోకి చేరికలు ఉండబోతున్నాయని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ, కన్నా లక్ష్మీనారాయణ పైవ్యాఖ్యలు చేశారు.
Go Back to Shorts
Kanna
Jagan
YSR
YSRCP
BJP

More Telugu News