‘సోనీ’ కిడ్నాపర్ మరో ఘరానా మోసం.. విజిలెన్స్ ఆఫీసర్‌గా వ్యాపారిని బురిడీ కొట్టిన రవిశేఖర్
- ఈ నెల 23న సోనీని కిడ్నాప్ చేసిన రవిశేఖర్
- సోమవారం కొండ్రపోలులోని ఎరువుల దుకాణంలో తనిఖీలు
- లక్ష రూపాయల నగదు, మూడు ఉంగరాలతో పరారీ
సోమవారం ఉదయం 7:55గంటల నుంచి 8:16 గంటల వరకు తనిఖీలు చేపట్టాడు. అనంతరం అతడి నుంచి లక్ష రూపాయల నగదు, మూడు ఉంగరాలు వసూలు చేసి పరారయ్యాడు. అక్కిడి నుంచి అతడు విజయవాడ వైపు వెళ్లి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, ఈ నెల 23న హయత్‌నగర్‌లో కిడ్నాప్‌నకు గురైన సోనీ ఆచూకీ ఇప్పటి వరకు తెలియరాలేదు. నిందితుడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.