Vijay Devarakonda: విజయ్ దేవరకొండతో కలిసి నవ్వులు పూయించిన మిథాలీ రాజ్

టాలీవుడ్ నయా సంచలనం విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ డియర్ కామ్రేడ్. కొన్నిరోజుల క్రితమే విడుదలైన ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. డియర్ కామ్రేడ్ చిత్రంలో విజయ్ సరసన రష్మిక మందన్న కథానాయికగా నటించింది. ఇక ఈ సినిమా విడుదల అనంతరం ఓ ప్రమోషన్ ఈవెంట్ లో చిత్రబృందంతో పాటు భారత మహిళా క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్ కూడా పాల్గొంది.

ఈ సందర్భంగా హీరో విజయ్ దేవరకొండతో మిథాలీ నవ్వులు పూయించిన వైనం అందరినీ ఆకట్టుకుంది. ఆ సమయంలో వేదిక మీద మహిళా ఎస్పీ రమా రాజేశ్వరితో పాటు మరో ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, ఇక్కడున్న మహిళలు తమ వృత్తిలో మంచి పేరు తెచ్చుకుంటున్నందుకు గర్వంగా ఉందన్నారు. ఈ సినిమాలో రష్మిక రాష్ట్రస్థాయి క్రికెటర్ పాత్ర పోషించిన విషయమని ప్రస్తావిస్తూ.. 'మిథాలీ, మీకు రష్మిక బ్యాటింగ్ నచ్చిందా?' అని విజయ్ అడిగాడు.

దాంతో, మిథాలీ తడుముకోకుండా, 'చాలా బాగా నచ్చింది, నిజంగా నీకంటే ఆమె బ్యాటింగ్ బాగా చేసింది' అంటూ సరదాగా వ్యాఖ్యానించింది. "నేను అడిగేది నటన గురించి కాదు, బ్యాటింగ్ గురించి. అయినా ఈ సినిమాలో నేను గల్లీ క్రికెట్ ఆడాను కాబట్టి, రష్మిక నాకంటే బాగా ఆడింది అంటున్నారా?" అంటూ విజయ్ కూడా ప్రతివ్యాఖ్యలు చేశాడు. ఈ సరదా సంభాషణను అక్కడున్న ప్రతి ఒక్కరూ హాయిగా ఆస్వాదించారు.
Vijay Devarakonda
Mithali Raj
Dear Comrade

More Telugu News