ఆదర్శ రాజకీయవేత్త జైపాల్ రెడ్డి: పవనకల్యాణ్
- రాజకీయ మేధావి, రాజనీతిజ్ఞుడు జైపాల్ రెడ్డి
- జైపాల్ మృతి దేశానికి, తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు
- అంజలి ఘటిస్తూ ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా
రెండుసార్లు కేంద్ర మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వర్తించిన జైపాల్ నిష్కళంకుడిగా పేరు గాంచారని, దేశానికి, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి చేసిన సేవలు చిరస్మరణీయమని, నేటి తరం రాజకీయ వేత్తలకు, యువకులకు ఆయన జీవితం ఆదర్శప్రాయమని అన్నారు. జైపాల్ రెడ్డికి అంజలి ఘటిస్తూ తన తరపున, జనసేన పార్టీ తరపున ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని అన్నారు.