బీజేపీది ధన రాజకీయం : సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు ప్రకాష్ కారత్
- కర్ణాటకలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కోటీశ్వరులయ్యారు
- ఏపీలో రాజ్యసభ సభ్యులను అలాగే కొన్నారు
- బీజేపీ, ఆర్ఎస్ఎస్లపై సైద్ధాంతిక పోరాటం చేయాలి
మరోవైపు హిందూమతానికి ప్రమాదం పొంచి ఉందని భయపెడుతూ హిందువులను కూడగట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. ఈ పరిస్థితుల్లో బీజేపీ, ఆర్ఎస్ఎస్ను కేవలం ఎన్నికల ద్వారా ఎదుర్కోవడం అసాధ్యమన్నారు. సైద్ధాంతిక పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇక, తమది లౌకిక పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ఓటర్లను ఆకట్టుకోవడం కోసం గత ఎన్నికల్లో గుడులు, గోపురాలు తిరిగారని ఎద్దేవా చేశారు.