మోడల్ పై అత్యాచార యత్నం.. చాకచక్యంగా తప్పించుకున్న వైనం!
- పుట్టినరోజు వేడుకకు హాజరై వస్తున్న మోడల్
- స్నేహితుడితో కలిసి క్యాబ్ డ్రైవర్ అత్యాచార యత్నం
- నాలుక కొరికి తప్పించుకున్న మోడల్
అయితే మోడల్ తన సెల్‌ఫోన్‌ను కారులోనే వదిలేయడంతో పోలీసులు దానికి కాల్ చేశారు. నిందితుడు ఫోన్ లిఫ్ట్ చేయడంతో అతడి ఆచూకీ కనుక్కుని అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు నాలుకకు అయిన గాయం కారణంగా ఆసుపత్రిలో చేరడంతో అనుమానమొచ్చిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు రెండో నిందితుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు.