బీసీసీఐ కలుగజేసుకోవడంతో టీమిండియా బౌలర్ షమీకి వీసా ఇచ్చిన అమెరికా
- షమీపై గృహహింస కేసు
- వీసా మంజూరు చేయలేమన్న అమెరికా రాయబార కార్యాలయం
- బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రీ జోక్యంతో వీసా మంజూరు
అయితే, షమీ అంతర్జాతీయ క్రీడాకారుడు అని, అతనికి పీ1 కేటగిరీలో వీసా మంజూరు చేయాల్సిందిగా బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రీ అమెరికన్ ఎంబసీకి లేఖ రాశారు. దాంతో షమీకి వీసా మంజూరైంది. త్వరలోనే వెస్టిండీస్ పర్యటనకు వెళుతున్న టీమిండియా తొలుత అమెరికాలో విండీస్ జట్టుతో రెండు టి20 మ్యాచ్ లు ఆడనుంది.