కలాం బోధనలు లక్షలాది మందికి స్ఫూర్తినిస్తున్నాయి!: ఏపీ సీఎం జగన్
- నేడు కలాం వర్ధంతి
- నివాళులు అర్పించిన ఏపీ సీఎం
- ఆయన సేవలు ఎల్లప్పుడూ గుర్తుంటాయని వ్యాఖ్య
ఈ సందర్భంగా కలాంను జగన్ భారత మిస్సైల్ పితామహుడిగా అభివర్ణించారు. ఈ మేరకు ఏపీ సీఎం జగన్ ట్విట్టర్ లో స్పందించారు. భారత రాష్ట్రపతిగా తప్పుకున్నాక ఎక్కువ సమయం విద్యార్థులకు పాఠాలు చెప్పడంలో కలామ్ గడిపారు. ఇందులో భాగంగా 2015, జూలై 27న ఐఐఎం షిల్లాంగ్ లో ప్రసంగిస్తూ గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆసుపత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.