హాలీవుడ్ తరహా దొంగతనం.. పోలీస్ దుస్తుల్లో వచ్చి 750 కేజీల బంగారం, ఇతర లోహాలు ఎత్తుకెళ్లిన దొంగలు!
- బ్రెజిల్ లోని పావోపాలో ఎయిర్ పోర్టులో ఘటన
- తుపాకులతో చొరబడ్డ నకిలీ పోలీసులు
- పరారీలో ఉన్న దొంగల కోసం గాలింపు
విమానాశ్రయంలోకి చొరబడ్డ దొంగలు ఇద్దరు గార్డుల కణతలకు తుపాకీ గురిపెట్టారు. అనంతరం విమానం కార్గో పాయింట్ దగ్గరకు వెళ్లారు. అక్కడే 750 కేజీల విలువైన బంగారం, ఇతర విలువైన లోహాలను ట్రక్కులో నింపుకుని పరారయ్యారు. ఈ ఘటన మొత్తం సీసీటీవీల్లో రికార్డయింది. కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దోపిడీకి గురైన లోహాల విలువ రూ.276 కోట్ల వరకూ ఉంటుందని చెప్పారు. పరారీలో ఉన్న దొంగల కోసం గాలింపును చేపడుతున్నట్లు పేర్కొన్నారు.