రెండు అరటిపండ్లకు రూ.442 వసూలు చేసిన హోటల్‌పై దర్యాప్తునకు ఆదేశించిన ప్రభుత్వం
- షూటింగ్ కోసం ఛండీఘర్ వెళ్లిన రాహుల్
- అరటి పండ్ల ఉదంతాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడి
- స్పందించిన ఛండీఘర్ డిప్యూటీ కమిషనర్
ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా రాహుల్ వెల్లడించారు. సోషల్ మీడియా ద్వారా రాహుల్ ట్వీట్ విపరీతంగా వైరల్ అవడంతో ఛండీఘడ్ డిప్యూటీ కమిషనర్ అండ్ ఎక్సైజ్ అండ్ ట్యాక్సేషన్ కమిషనర్ మణిదీప్ సింగ్ బ్రార్ దీనిపై స్పందించారు. రెండు అరటి పండ్లకు అత్యధిక ధరతో పాటు జీఎస్టీని వసూలు చేసిన హోటల్ మారియట్‌పై దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశారు. ఇది రుజువైతే హోటల్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని మణిదీప్‌సింగ్ హెచ్చరించారు.