లైవ్‌లో ఒళ్లు గగుర్పొడిచే విన్యాసం.. చూస్తుండగానే మృతి చెందిన బ్లాగర్
- ఫాలోవర్లను పెంచుకునేందుకు ప్రమాదకరమైన సాహసకృత్యం
- విషపూరిత జెర్రిలు, బల్లులు, పురుగులు తిన్న బ్లాగర్
- షాక్‌కు గురైన ఫాలోవర్లు
15 వేల మంది ఫాలోవర్లను కలిగిన సన్ ‘స్టమక్ చర్నింగ్ చాలెంజ్’ (కడుపు నింపే సవాలు)తో లైవ్‌లోకి వచ్చాడు. ఓ ప్లేటులో జెర్రిలు, మరో ప్లేటులో పురుగులు, ఇంకో ప్లేటులో బల్లులు ఇలా.. అన్నీ తీసుకొచ్చిన సన్.. లైవ్‌లో వాటిని తినేసి ఆ తర్వాత మద్యం తీసుకున్నాడు. అనంతరం అపస్మారక స్థితిలోకి చేరుకుని కుప్పకూలాడు. దీంతో షాక్‌కు గురైన గాళ్ ఫ్రెండ్ అతడి గదిలోకి వెళ్లి చూడగా అపస్మారక స్థితిలో పడున్నాడు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.