స్వామి వివేకానందను.. స్వామి వివేకానందరెడ్డిగా పేర్కొన్న వైసీపీ ఎమ్మెల్యే!

  • అమెరికాను కనుగొన్నది వాస్కోడామా అన్న మధుసూదనరెడ్డి
  • స్వామి వివేకానందను వివేకానందరెడ్డిగా మార్చేసిన అబ్బయ్య చౌదరి
  • ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
ఏపీ అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు తమ వ్యాఖ్యలతో అభాసుపాలవుతున్నారు. తొలిసారి సభలో మాట్లాడిన మధుసూదనరెడ్డి అమెరికాను కనుగొన్నది ‘వాస్కోడామా’ అని పేర్కొనగా, పక్కనే ఉన్న సభ్యులు ‘వాస్కోడగామా’ అని ఉప్పందించారు. అయితే, అమెరికాను కనుగొన్నది వాస్కోడగామా కాదని, కొలంబస్ అన్న విషయం వారికీ తెలియదని అర్థమైపోయింది.

దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి విద్యావ్యవస్థ గురించి మాట్లాడుతూ.. స్వామి వివేకానందను స్వామి వివేకానందరెడ్డిగా పేర్కొని అభాసుపాలయ్యారు. ‘ఇఫ్ ది పూర్ కెనాట్ కమ్ టు ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ మస్ట్ రీచ్ దెమ్, ఎట్ ది ప్లౌ, ఇన్ ది బేకరీ ఫ్యాక్టరీ అండ్ ఎవిరీ వేర్’ అని స్వామి వివేకానందరెడ్డి గారు అన్నారని చెప్పడంతో సభలోని సభ్యులే కాదు, టీవీల ముందు ఉన్న వారు కూడా విస్తుపోయారు. నోరు జారిన ఎమ్మెల్యేలను నెటిజన్లు ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు. 
Go Back to Shorts
YSRCP
assembly
Abbaiah choudary
swamy vivekananda

More Telugu News