మెగాస్టార్ చిరంజీవితో సమావేశమైన పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్!
- సైరా షూటింగ్ పూర్తి.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు
- పలు అంశాలపై చర్చించామన్న మనోహర్
- చిరంజీవి ప్రయాణం మాకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది
ఈ మీటింగ్ కు సంబంధించిన ఫొటోను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన నాదెండ్ల మనోహర్..‘పవన్ కల్యాణ్ గారు, నేను సైరా నరసింహారెడ్డి(చిరంజీవి గారి)ని కలుసుకున్నాం. ఈ సమావేశం అద్భుతంగా జరిగింది. ఈ భేటీలో మేం చాలా అంశాలపై చర్చించాం. ఆయన జీవిత ప్రయాణం మాకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. చిరంజీవిగారు మరిన్ని విజయాలు సాధించాలని, ఇలాంటి సమావేశాలు మళ్లీమళ్లీ జరగాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు.