చంద్రబాబు ఆందోళనంతా కరకట్ట నివాసం, బినామీ ఆస్తులు, రియల్ ఎస్టేట్ ధరల గురించే!: విజయసాయిరెడ్డి ఎద్దేవా

  • ఆయనకు ప్రజా సమస్యలు పట్టవు
  • బినామీల స్థిరాస్తి వ్యాపారం కోసమే అమరావతి
  • ట్విట్టర్ లో విమర్శలు గుప్పించిన వైసీపీ నేత
టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ప్రజా సమస్యలు పట్టడం లేదని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారం కంటే కరకట్ట నివాసం, బినామీ ఆస్తులు, అమరావతిలో రియల్ ఎస్టేట్ ధరలు పడిపోవడంపైనే చంద్రబాబు ఆందోళన చెందుతున్నారని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు అమరావతిని తన బినామీ స్థిరాస్తి వ్యాపారం కోసమే ఎంపిక చేశారని దుయ్యబట్టారు. ఇప్పుడు పునాదులు కూడా లేవని అమరావతిని చంపేశారు అంటూ శోకాలు పెడుతున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో స్పందించారు.
Go Back to Shorts
Andhra Pradesh
Chandrababu
Telugudesam
YSRCP
Vijay Sai Reddy
Twitter

More Telugu News