నాగబాబుగారు కాల్ చేసి ఆ మాట అనగానే ఏడ్చేశాను: 'జబర్దస్త్' అభి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నాగబాబుగారు కాల్ చేసి ఆ మాట అనగానే ఏడ్చేశాను: 'జబర్దస్త్' అభి

  • డైరెక్షన్ చేయాలనే కోరిక బలంగా వుంది 
  • ఇంతవరకూ సరైన అవకాశం రాలేదు
  • నాగబాబుగారి కాంప్లిమెంట్ బలాన్నిచ్చిందన్న అభి  
'జబర్దస్త్' కోసం సాఫ్ట్ వేర్ సంస్థలో జాబ్ ను కూడా వదులుకుని వచ్చిన 'అదిరే అభి', చాలా తక్కువ కాలంలోనే ఎక్కువ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ. తన కెరియర్లో జరిగిన ఒక సంఘటనను గురించి ప్రస్తావించాడు.

"డైరెక్షన్ చేయడమంటే నాకు చాలా ఇష్టం. అయితే డైరెక్టర్ గా నన్ను నేను నిరూపించుకునే అవకాశాలు రావడం లేదు. ఆ విషయంలో నేను అసంతృప్తిగా వున్న సమయంలో, నాగబాబు గారు ఒక కంటెంట్ పై ఒక వీడియో చేసి ఇవ్వమన్నారు .. అలాగే చేసి ఇచ్చాను. రెండు రోజుల తరువాత ఆయన నాకు కాల్ చేశారు. 'చాలా బాగా చేశావ్ .. ఆర్టిస్టుగా నీకు ఎంత టాలెంట్ వుందో, దర్శకుడిగా అంతకి మించిన టాలెంట్ వుంది. ఏదో రోజున మంచి డైరెక్టర్ వి అవుతావు' అన్నారు. అంతే.. ఒక్కసారిగా నాకు ఏడుపు వచ్చేసింది. ఆయన కాంప్లిమెంట్ నాకు ఎంతో బలాన్నిచ్చింది' అని చెప్పుకొచ్చాడు. 
Abhi

More Telugu News