కుక్క కరుస్తుందన్న భయంతో ఓ ఇంట్లో దూరితే... దొంగనుకొని చంపేశారు!
- యూపీలోని బారాబంకీలో ఘటన
- మందు కొట్టి వస్తున్న వ్యక్తి వెంటపడ్డ శునకం
- కట్టేసి.. దారుణ హత్య
దాని బారిన పడాల్సి వస్తుందన్న ఆందోళనతో పక్కనే కనిపించిన ఓ ఇంట్లోకి దూరాడు. అప్పటికే అతను పూటుగా మద్యం తాగి ఉండటంతో, అతను విషయాన్ని విడమరచి చెప్పలేకపోయాడు. తమ ఇంట్లో దొంగతనానికి వచ్చాడని భావించిన ఇంట్లోని వారంతా ఏకమై, అతన్ని బంధించి, ఇనుపచువ్వలతో కాల్చి చిత్ర హింసలు పెడుతూ కిరాతకంగా హతమార్చారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి, ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని అరెస్ట్ చేశామని తెలిపారు.