బిడ్డను చిత్రవధ చేస్తున్న తల్లి... సంచలన వీడియోను పోస్ట్ చేసి పాపెవరో చెప్పాలన్న రజనీకాంత్ భార్య!

  • 'దయా ఫౌండేషన్'ను నిర్వహిస్తున్న లతా రజనీకాంత్
  • బాలిక ఎవరో తెలిస్తే చెప్పాలని వినతి
  • బాలికకు రక్షణ కల్పించేందుకు సిద్ధమని వెల్లడి
అనాధ బాలల కోసం 'దయా ఫౌండేషన్'ను నిర్వహిస్తూ, వారిని ఆదుకునే ప్రయత్నం చేస్తున్న సూపర్ స్టార్ రజనీకాంత్ భార్య లత, ఓ సంచలన వీడియోను పోస్ట్ చేశారు. ఇందులో తీవ్ర చిత్ర హింసలను అనుభవిస్తున్న బాలిక ఎవరో ఎవరికైనా తెలిస్తే, తమకు తెలియజేయాలంటూ, ఓ ఫోన్ నంబర్ ను కూడా ఇచ్చారు.

 'పీస్‌ ఆఫ్‌ చిల్డ్రన్స్‌' పేరిట సేవాకార్యక్రమాలను నిర్వహిస్తున్న లతా రజనీకాంత్, తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో, ఓ మహిళ, నిండా రెండేళ్లు కూడా ఉండని ఓ బాలికను చిత్ర వధ చేస్తోంది. ఎత్తి కుదేస్తూ, మీదెక్కి కూర్చోవడంతో పాటు, కాలితో తొక్కుతోంది. ఈ వీడియో చూసిన వారు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సదరు బాలిక ఎవరో తెలిస్తే, వెంటనే చెప్పాలని, బాలికకు రక్షణ కల్పించేందుకు సిద్ధమని లతా రజనీకాంత్ తెలియజేశారు.
Go Back to Shorts
Rajanikant
Latha
Twitter
Mother

More Telugu News