విశాఖ ఏజెన్సీలో హృదాయ విదారకం.. దుప్పటిని డోలిలా కట్టి నిండు గర్భిణీని మోసుకెళ్లిన గ్రామస్తులు!
- వి.మాడుగల మండలంలోని కొత్త వలసలో ఘటన
- రోడ్లు, వైద్య సౌకర్యం లేక అవస్థలు
- పదిహేను కిలోమీటర్లు డోలిని మోసుకెళ్లిన వైనం
సుమారు పదిహేను కిలోమీటర్ల మేరకు ఆమెను డోలిలో అలా మోసుకెళ్లారు. దారి మధ్యలో వర్షం పడినా, బురద ఉన్నా అలానే ముందుకు కదిలారు. ఎంతో కష్టపడి ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. అదృష్టవశాత్తు పండంటి ఆడబిడ్డకు ఆమె జన్మనిచ్చింది. తల్లీ బిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నట్టు వైద్యులు చెప్పారు.ఇదిలా ఉండగా, ఈ కథనం మీడియాలో ప్రసారం కావడంతో కలెక్టర్ వినయ్ చంద్ స్పందించారు. ఆమెకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.