గర్ల్ ఫ్రెండ్ కు రక్తతిలకం దిద్ది... హతమార్చి ఆత్మహత్య!
- యూపీ యువకుడికి ముంబై యువతితో పరిచయం
- తనతో పాటు వచ్చేందుకు అంగీకరించని యువతి
- ప్రియురాలిని గొంతు పిసికి చంపిన ప్రియుడు
వారణాసికి వెళుతున్నానని ఇంట్లో చెప్పిన అరుణ్ గుప్తా, ముంబైకి వచ్చి, కల్యాణ్ లోని ఓ గెస్ట్ హౌస్ లో రూమ్ తీసుకుని, ప్రతిభను పిలిచాడు. శుక్రవారం మధ్యాహ్నం గదిలోకి వెళ్లిన వీరిద్దరూ ఆసలు బయటకే రాలేదని, సాయంత్రం 6 గంటల సమయంలో మంచినీరు అడిగారని, రాత్రి భోజనానికి రాకపోవడంతో వెళ్లి తలుపులు కొట్టినా తీయలేదని లాడ్జ్ సిబ్బంది పోలీసులకు వెల్లడించారు.
పోలీసులు వచ్చి చూసేసరికి ఇద్దరూ విగతజీవులై పడివున్నారు. బ్లేడ్ తో తన చేతికి గాయం చేసుకుని, ఆమె నుదుటన సింధూరంలా దిద్ది, సెల్ఫీలు దిగి, ఆపై ప్రతిభను గొంతుపిసికి హత్య చేసిన అరుణ్, సీలింగ్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నట్టు తెలిపారు.