జగన్ నిర్ణయాలతో చంద్రబాబు వెన్నులో వణుకు మొదలైంది.. ఎవ్వరూ తప్పించుకోలేరు!: విజయసాయిరెడ్డి

  • అవినీతి జరగలేదని సర్టిఫికెట్లు ఇచ్చుకుంటున్నారు
  • మరికొందరు పార్టీ మారిపోయి ఎస్కేప్ అవుతున్నారు
  • ట్విట్టర్ లో ఘాటుగా స్పందించిన వైసీపీ ఎంపీ
తెలుగుదేశం అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జ్యుడీషియల్ కమిషన్, రివర్స్ టెండరింగ్, విద్యుత్ పీపీఏలపై సమీక్ష సహా సీఎం జగన్ తీసుకుంటున్న పలు నిర్ణయాలతో చంద్రబాబు, ఆయన కోటరి వెన్నులో వణుకు మొదలైందని వ్యాఖ్యానించారు.

అందుకే ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదని వారికి వారే సర్టిఫికెట్లు ఇచ్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. వీరిలో కొందరు పార్టీలు మారిపోయి ఎస్కేప్ రూప్ పట్టారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎవరు ఏం చేసినా తప్పించుకోలేరని హెచ్చరించారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి స్పందించారు.
Go Back to Shorts
Andhra Pradesh
YSRCP
Vijay Sai Reddy
Twitter
Chandrababu
Telugudesam
warning

More Telugu News