చిన్న పొరపాటుతో అమెజాన్ కు భారీ నష్టం... రూ. 9 లక్షల కెమెరా రూ. 6.500 కే... ఎగబడి కొనేశారు!
- అమెజాన్ లో సాంకేతిక సమస్య
- విషయం సోషల్ మీడియాలో వైరల్
- వస్తువులు ఇచ్చే విషయమై తేల్చని అమెజాన్
అమెజాన్ టెక్నికల్ వైఫల్యంతో, ఫ్యుజి, కెనాన్, సోనీ వంటి కంపెనీల ఖరీదైన కెమెరాలు అతి తక్కువ ధరకు అమ్ముడయ్యాయి. రూ. 3 వేల నుంచి 5 వేల డాలర్ల వరకూ ఉన్న కెమెరాలు, 100 డాలర్లకులోపే లభించాయి. దీనిపై స్పందించిన అమెజాన్, సైట్ లో చోటు చేసుకున్న సాంకేతిక సమస్య కారణంగా ఈ తప్పు జరిగిందని తెలిపింది. ఇక వీరికి కెమెరాలను పంపిస్తారా? అన్న విషయమై సంస్థ ఇంకా ఏమీ తేల్చలేదు.