ధోనీ రిటైర్మెంట్ పై కీలక వ్యాఖ్యలు చేసిన బీసీసీఐ మాజీ సెక్రటరీ జగ్దాలే

  • ధోనీ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు ప్రస్తుతం కనిపించడం లేదు
  • ఎప్పుడు రిటైర్ కావాలో నిర్ణయించుకునే మెచ్యూరిటీ ధోనీకి ఉంది
  • ధోనీ ఒక గొప్ప క్రికెటర్
టీమిండియా కెప్టెన్ ధోనీ రిటైర్మెంట్ పై భారీ ఎత్తున చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. త్వరలో జరగనున్న వెస్టిండీస్ టూర్ కు ధోనిని ఎంపిక చేస్తారా? లేదా? అనే చర్చ కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ సెలెక్టర్ సంజయ్ జగ్దాలే కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుత పరిస్థితిలో ధోనీ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు కనిపించడం లేదని ఆయన తెలిపారు. ధోనీ ఒక గొప్ప ఆటగాడని... నిస్వార్థంగా దేశం కోసం ఆడాడని కితాబిచ్చారు. ధోనీలాంటి వికెట్ కీపర్-బ్యాట్స్ మెన్ కు ప్రస్తుతం ప్రత్యామ్నాయం లేదని చెెప్పారు. లిమిటెడ్ ఓవర్ల క్రికెట్ నుంచి ఎప్పుడు రిటైర్మెంట్ తీసుకోవాలో నిర్ణయించుకునే మెచ్యూరిటీ ధోనీకి ఉందని బీసీసీఐ సెక్రటరీగా కూడా పని చేసిన జగ్దాలే తెలిపారు.

మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ కు చెందిన ఒక అధికారి మాట్లాడుతూ, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే పరిణతి ధోనీకి ఉందని చెప్పారు. సచిన్ టెండూల్కర్ విషయంలో వ్యవహరించిన మాదిరిగానే... ధోనీతో సెలెక్టర్లు మాట్లాడాలని, భవిష్యత్తుపై ఆయన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలని సూచించారు.
Go Back to Shorts
MS Dhoni
Retirement
Sanjay Jagdale
BCCI
Team India

More Telugu News