పాత సీఎం క్యాంపు కార్యాలయాన్ని ఏపీ నూతన గవర్నర్ కు కేటాయించే యోచన!

  • రెండ్రోజుల్లో విజయవాడ రానున్న హరిచందన్
  • పాత సీఎం కార్యాలయాన్ని పరిశీలించిన అధికారులు
  • సీసీ కెమెరాల పని తీరు, భద్రతా ఏర్పాట్లపై పోలీసుల ఆరా
ఏపీకి నూతన గవర్నర్ గా బిశ్వ భూషణ్ హరిచందన్ ను నియమించిన విషయం తెలిసిందే. రెండు రోజుల్లో హరిచందన్ విజయవాడకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో విజయవాడలోని పాత సీఎం క్యాంపు కార్యాలయాన్ని ఆయనకు కేటాయించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఆ కార్యాలయాన్ని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమల రావు, ఇంటెలిజెన్స్ పోలీసులు పరిశీలించారు. అక్కడ  సీసీ కెమెరాల పని తీరు, భద్రతా ఏర్పాట్లపై ఆరా తీశారు.
Go Back to Shorts
Andhra Pradesh
Governer
Hari chandan
Vijayawada

More Telugu News