పార్లమెంటు నియోజకవర్గాల ఆధారంగానే 25 జిల్లాలు ఏర్పాటుచేస్తాం!: ఏపీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్
- అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా చర్చ
- ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని సభ్యుల సూచన
- ఈ విషయం ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉందన్న మంత్రి
కొత్త జిల్లాల ఏర్పాటు అంశం ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉందని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో సభ్యులు ఇచ్చే సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొన్నారు. దీంతో సభ్యులు స్పందిస్తూ.. జిల్లాల ఏర్పాటుకు ముందు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని సూచించారు. అలాగే ఇందుకోసం అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. పరిపాలన సౌలభ్యం ఉండేలా జిల్లాలను ఏర్పాటు చేయాలన్నారు.