రక్షణ నిధికి ఎయిర్‌ఫోర్స్ మాజీ ఉద్యోగి భారీ విరాళం

  • ఎయిర్‌ఫోర్స్‌లో 108 నెలలు పనిచేసిన ప్రసాద్
  • నెలకు లక్ష చొప్పున రూ.108 లక్షల విరాళం
  • ఏపీ, తెలంగాణలో స్పోర్ట్స్ అకాడమీల ఏర్పాటు
హైదరాబాద్‌కు చెందిన ఎయిర్ ఫోర్స్ మాజీ ఉద్యోగి సీబీఆర్ ప్రసాద్ రక్షణ శాఖకు భారీ విరాళం అందించారు. ఎయిర్‌ఫోర్స్‌లో గతంలో 108 నెలలు పనిచేసిన ఆయన నెలకు లక్ష చొప్పున రూ.108 లక్షల విరాళాన్ని అందించారు. ఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ను కలిసి రూ.1.08 కోట్ల చెక్‌ను అందించారు.

ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగం తర్వాత ప్రసాద్ పౌల్ట్రీ వ్యాపారంలోకి ప్రవేశించారు. ఈ రంగంలో సంపాదించిన సొమ్మును సమాజ సేవకు వినియోగించాలని నిర్ణయించినట్టు ప్రసాద్ తెలిపారు. అలాగే, విద్యార్థులను క్రీడలవైపు ప్రోత్సహించేందుకు ఏపీ, తెలంగాణలో అకాడమీలు ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. కృష్ణా జిల్లాలో ఏర్పాటు చేసిన అకాడమీలోని విద్యార్థులు జాతీయ స్థాయిలో రాణిస్తున్నట్టు చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతానని ప్రసాద్ వివరించారు.
Go Back to Shorts
Airforce
CBR Prasad
Rajnath singh
defence

More Telugu News