కేసీఆర్ పై యుద్ధం చేయడం కుంతియా, ఉత్తమ్ కుమార్ రెడ్డి వల్ల కాదు!: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
- కాంగ్రెస్ నాకు రాజకీయ జన్మనిచ్చింది
- పార్టీ షోకాజ్ నోటీసులకు జవాబు ఇచ్చా
- చండూరులో మీడియాతో కాంగ్రెస్ నేత
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై యుద్ధం చేయాలంటే అది కాంగ్రెస్ నేతలు కుంతియా, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వల్ల కాదని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని తాను ఎన్నికల ముందే చెప్పాననీ, ఆ తర్వాత కూడా చెప్పానని గుర్తుచేశారు. ఈ విషయంలో పార్టీకి నష్టం కలిగించరాదన్న ఉద్దేశంతో తాను మౌనంగా ఉండిపోయానని చెప్పారు.