తిరుమల వెంకన్నను దర్శించుకున్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కుటుంబం
- నిన్న తిరుపతి చేరుకున్న రాష్ట్రపతి కోవింద్ ఫ్యామిలీ
- నేడు శ్రీవారి దర్శనం
- స్వాగతం పలికిన అధికారులు, ప్రజా ప్రతినిధులు
అనంతరం రాష్ట్రపతి కోవింద్ కుటుంబానికి తీర్థ ప్రసాదాలు అందించి, ఆశీర్వచనం చేశారు. నిన్న తిరుమలకు చేరుకున్న ఆయన, సాయంత్రం పద్మావతి అమ్మవారిని, కపిలేశ్వర స్వామివారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. మరికాసేపట్లో రాష్ట్రపతి శ్రీహరికోటకు వెళ్లనున్నారు. రాత్రికి అక్కడే బస చేసి, చంద్రయాన్-2 ప్రయోగాన్ని దగ్గరుండి పరిశీలించనున్నారు.