Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'ఇస్మార్ట్ శంకర్'కి హిట్ ఖాయం: హీరోయిన్ నభా నటేశ్

  • పూరి కథ చెప్పగానే ఓకే అన్నాను
  • మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే పాత్ర
  • ఈ ఛాన్స్ లభించడం అదృష్టమన్న నభా
రామ్ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'ఇస్మార్ట్ శంకర్' రూపొందింది. రామ్ సరసన నిధి అగర్వాల్ .. నభా నటేశ్ కథానాయికలుగా నటించారు. ఈ నెల 18వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో పూరి .. రామ్ .. నిధి అగర్వాల్ తో పాటు, నభా నటేశ్ కూడా బిజీగా వుంది.

తాజా ఇంటర్వ్యూలో నభా నటేశ్ మాట్లాడుతూ .. 'ఇస్మార్ట్ శంకర్' సినిమాలో నా పాత్రను గురించి పూరిగారు చెప్పగానే, వెంటనే ఓకే చెప్పేశాను. ఎందుకంటే ఇలాంటి పాత్ర చాలా అరుదుగా వస్తుంది. ఈ సినిమాలో రామ్ పాత్రకి తగినట్టుగానే నన్ను పూరి చూపించారు. ట్రైలర్లో నన్ను మీరు చూసింది శాంపిల్ మాత్రమే. సినిమాలో నా పాత్ర మాస్ ఆడియన్స్ కి బాగా నచ్చేలా ఉంటుంది. పూరి .. రామ్ కాంబినేషన్లో నటించే అవకాశం రావడం నా అదృష్టం. ఈ సినిమా తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందనే నమ్మకం వుంది" అని చెప్పుకొచ్చింది.
Ram
Nidhi
Nabha

More Telugu News