తైవాన్ విషయంలో మీ బోడి పెత్తనమేంటి?: అమెరికాను హెచ్చరించిన చైనా
- తైవాన్‌కు ఆయుధాలు విక్రయించాలని అమెరికా నిర్ణయం
- కొత్త సమస్యలు సృష్టించడం మానుకోవాలన్న చైనా
- పునరేకీకరణను ఏ శక్తీ అడ్డుకోలేదంటూ తీవ్ర వ్యాఖ్యలు
హంగేరీ పర్యటనలో ఉన్న చైనా విదేశాంగ మంత్రి వాంగ్ మాట్లాడుతూ.. తైవాన్ విషయంలో అమెరికా జోక్యం తగదని పేర్కొన్నారు. పునరేకీకరణను ఏ శక్తీ అడ్డుకోలేదంటూ పరోక్షంగా తైవాన్ను ఉద్దేశించి అన్నారు. కొత్త సమస్యలు సృష్టించాలని చూస్తే అమెరికా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వాంగ్ హెచ్చరికలు జారీ చేశారు.