మెహుల్ చోక్సీ ఆస్తులపై ఈడీ కొరడా.. రూ.24.77 కోట్ల ఆస్తులు జప్తు
- పీఎన్బీ నుంచి రూ.13 వేల కోట్ల రుణం
- ప్రస్తుతం అంటిగ్వాలో ఉంటున్న చోక్సీ
- భారత్ సహా దుబాయ్లో ఉన్న ఆస్తుల జప్తు
తాజా జప్తుతో కలిసి ఇప్పటి వరకు జప్తు చేసిన ఆస్తుల మొత్తం రూ.2534.7 కోట్లని వివరించారు. గతేడాది పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి రూ.13 వేల కోట్ల రుణాలు తీసుకున్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ దేశం విడిచి పరారయ్యారు. చోక్సీ ప్రస్తుతం అంటిగ్వాలో తలదాచుకున్నాడు. అతడిని భారత్కు రప్పించేందుకు భారత్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.