చంద్రబాబును సీఎంగా ఉండగా వెళ్లి కలిశాం.. నిధులు ఇవ్వను పో అని కరాఖండిగా చెప్పేశారు!: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
- నేను చంద్రబాబును కలవను అని చెప్పా
- కానీ జగన్ నా ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలను పంపారు
- ఇప్పుడు సీఎం జగన్ కు బాబు ధన్యవాదాలు తెలిపితే సంతోషిస్తా
దీంతో సీఎంను కలిసి.. గతంలో వైఎస్ ప్రతీ ఎమ్మెల్యేకు రూ.కోటి ఇచ్చేవారు. నువ్వు కూడా ఓ టర్మ్ లో ఇచ్చావు. ఇప్పుడు కూడా ఇవ్వాలని అడిగాం. దీంతో 'పరిస్థితులు మారాయి. ఈసారి నేను ఇవ్వను' అని కరాఖండిగా చెప్పారు. ఇప్పుడు సీఎం జగన్ ప్రతీఒక్కరికీ రూ.కోటి ఇస్తామని ప్రకటించారు కాబట్టి చంద్రబాబు జగన్ మాటలకు మనసారా ధన్యవాదాలు తెలిపితే సంతోషిస్తా’’ అని పెద్దిరెడ్డి అన్నారు. దీంతో వైసీపీ సభ్యులంతా బల్లలు చరుస్తూ హర్షం వ్యక్తం చేశారు.