టీడీపీ నేతలు రూ.400 కోట్లు దొబ్బేశారన్న మంత్రి అనిల్.. ‘దొబ్బేయడం’ అనడంపై స్పీకర్, టీడీపీ అభ్యంతరం!
- వైఎస్ హయాంలోనే అన్ని అనుమతులు వచ్చాయన్న మంత్రి
- దొబ్బేయడం అనే పదం అన్ పార్లమెంటరీ అన్న స్పీకర్ తమ్మినేని
- తన వ్యాఖ్యను వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించిన మంత్రి అనిల్
దీంతో దొబ్బేయడం(దొంగిలించడం) అనే పదాన్ని వాడటంపై టీడీపీ సభ్యులు నిరసన తెలిపారు. స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా ఈ ఆన్ పార్లమెంటరీ పదాన్ని వెనక్కు తీసుకోవాలని మంత్రికి సూచించారు. దీంతో చివరికి తన వ్యాఖ్యను వెనక్కి తీసుకుంటున్నట్లు మంత్రి అనిల్ అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సర్వహక్కులు వైఎస్ కే ఉన్నాయనీ, ఈ ప్రాజెక్టును పూర్తిచేయబోయేది కూడా తామేనని మంత్రి స్పష్టం చేశారు.