ఏమయ్యా లోకేశం.. నీ డబ్బుతో వేస్తున్నావా? లేక చేస్తున్నావా? కొంచెం బుర్రను వాడండి!: వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి

  • ‘బడికొస్తా’ సైకిళ్లకు రాజన్న బడిబాట స్టిక్కర్లు
  • ట్విట్టర్ సాక్షిగా నారా లోకేశ్ విమర్శలు
  • లోకేశ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తెచ్చిన ‘బడికొస్తా’ పథకం సైకిళ్లకు వైసీపీ ప్రభుత్వం రాజన్న బడిబాట స్టిక్కర్లు వేసి పంపిణీ చేస్తోందని టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శించిన సంగతి తెలిసిందే. పచ్చబొట్టు లాంటి టీడీపీ అభివృద్ధి పనులకు స్టిక్కర్లు వేసుకుంటూ పోవాలంటే సీఎం జగన్ కు రాబోయే ఐదేళ్లు కూడా సరిపోవని ఎద్దేవా చేశారు. తాజాగా ఈ వ్యాఖ్యలకు వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి కౌంటర్ ఇచ్చారు.

ఈరోజు ట్విట్టర్ లో లేళ్ల అప్పిరెడ్డి స్పందిస్తూ..‘ఏమయ్యా లోకేశం నీ డబ్బుతో వేస్తున్నావా లేక చేస్తున్నావా ?? ప్రజల డబ్బే కదా ?? ఈరోజు ఆంధ్రప్రదేశ్ బస్సుల పైన మీ నాన్న గారి ముఖారవిందం ఇప్పటికీ దర్శనం ఇస్తాయి. అలా అని బస్సులన్నీ మీవి కాదు కద ?? కొంచం అన్నా ఉన్న బుర్రను వాడండి’ అని చురకలు అంటించారు.
Go Back to Shorts
Andhra Pradesh
Telugudesam
Nara Lokesh
lella appireddy
Twitter
Jagan
Chief Minister

More Telugu News