ఆక్సిజన్ మాస్క్‌తో అంబులెన్స్‌లో వచ్చి లొంగిపోయిన శరవణ భవన్ రాజగోపాల్
- 2001లో తన ఉద్యోగిని హత్య చేసిన రాజగోపాల్
- యావజ్జీవ శిక్ష విధించిన కోర్టు
- సుప్రీంకోర్టులోనూ ఎదురుదెబ్బ
2001లో తన దగ్గర పనిచేసే ఉద్యోగి శాంతకుమార్‌ను కిడ్నాప్ చేసి హత్య చేసిన కేసులో 72 ఏళ్ల రాజగోపాల్‌కు యావజ్జీవ శిక్ష పడింది. ఈ కేసులో రాజగోపాల్‌తోపాటు మరో 8 మందిని 2004లో దోషులుగా తేల్చిన కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. హైకోర్టులోనూ ఆయనకు ఊరట లభించలేదు. పదేళ్ల జైలు శిక్షను కోర్టు యావజ్జీవ శిక్షగా మార్చింది. ఈ తీర్పును సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. అయితే, శిక్షను ఆలస్యంగా ప్రారంభించాలన్న ఆయన అభ్యర్థనను సుంప్రీం కోర్టు కూడా తిరస్కరించడంతో మంగళవారం ఆయన లొంగిపోయాడు.