కర్ణాటక స్పీకర్ ను కలిసిన కాంగ్రెస్ నేతలు... అసంతృప్తులపై అనర్హత వేటు వేయాలంటూ విజ్ఞప్తి
- కర్ణాటక విధాన సౌధలో కాంగ్రెస్ శాసనసభాపక్షం సమావేశం
- అసంతృప్త ఎమ్మెల్యే రామలింగారెడ్డి కుమార్తె సౌమ్యారెడ్డి హాజరు
- 8 మంది రాజీనామాలు సక్రమంగా లేవన్న స్పీకర్
అంతకుముందు, విధాన సౌధలో కాంగ్రెస్ శాసనసభాపక్షం సమావేశం కాగా, రామలింగారెడ్డి కుమార్తె సౌమ్యారెడ్డి హాజరయ్యారు. కాగా, కాంగ్రెస్ నేతల విజ్ఞప్తిపై ఈ నెల 11న సమీక్ష జరపనున్నట్టు స్పీకర్ తెలియజేశారు. రాజీనామాలు సమర్పించిన 13 మందిలో 8 మంది రాజీనామాలు సక్రమంగా లేవని అన్నారు. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలంతా తన ఎదుట హాజరైన తర్వాతే నిర్ణయం ప్రకటిస్తానని వెల్లడించారు. ప్రతాప్ గౌడ, నారాయణగౌడ, ఆనంద్ సింగ్ లను ఈ నెల 12న తన ఎదుట హాజరుకావాలని స్పీకర్ ఆదేశాలు పంపారు. రామలింగారెడ్డికి మాత్రం ఈ నెల 15న హాజరుకావాలంటూ తెలిపారు.