నీటి ఆదాకు చెన్నై యువ ఇంజనీర్ల పరిష్కారం.. 95 శాతం నీటిని ఆదాచేసేలా నాజిల్స్ అభివృద్ధి!
- నీళ్లకు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న చెన్నై వాసులు
- 2020 నాటికి భూగర్భ జలాలే ఉండవంటున్న నిపుణులు
- నీటిని ఆదా చేసేందుకు ముందుకొచ్చిన యువ ఇంజనీర్లు
ఈ విషయమై ఇంజనీర్లు స్పందిస్తూ.. సాధారణంగా చేతులు కడిగేటప్పుడు మనం నిమిషానికి 600 మిల్లీలీటర్ల నీటిని వాడుతాం. కానీ మా నాజిల్స్ ను అమర్చుకుంటే 10-20 మిల్లీలీటర్ల నీరు మాత్రమే ఖర్చవుతుంది’ అని తెలిపారు. ఈ నాజిల్స్ ను ఇంట్లోని కుళాయిలకు బిగించుకుంటే రోజుకు 35 లీటర్ల నీటిని ఆదా చేయవచ్చని వెల్లడించారు.
ఈ నాజిల్స్ నీటి ధారను బాగా తగ్గించడం వల్ల మనం వాడే నీటిలో 95 శాతం వరకూ ఆదా చేయవచ్చని పేర్కొన్నారు. అన్నట్లు ‘ఎర్త్ ఫోకస్’ అనే కంపెనీ పేరుతో అమ్ముతున్న ఈ నాజిల్స్ కు డిమాండ్ కూడా భారీగా ఉంది. మార్కెట్ కి వచ్చిన కొన్ని రోజులకే చెన్నైలో దాదాపు 7,000 నాజిల్స్ అమ్ముడుపోయాయి.