Andhra Pradesh: వైసీపీ నేతలు మీడియాను కూడా బెదిరిస్తున్నారు.. టీడీపీ శ్రేణులపై దాడులు చేస్తే ఊరుకోం!: చంద్రబాబు
తెలుగుదేశం అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ఈరోజు కడప ఎయిర్ పోర్టులో దిగారు. అనంతపురం జిల్లాలో పర్యటించేందుకు అమరావతి నుంచి నేరుగా కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ శ్రేణులపై దౌర్జన్యాలు, దాడులు పెరిగిపోయాయని విమర్శించారు.
చివరికి వైసీపీ నేతలు మీడియాను కూడా బెదిరిస్తున్నారని వ్యాఖ్యానించారు. టీడీపీ శ్రేణులపై దాడులు చేస్తే ఊరుకోబోమని స్పష్టం చేశారు. పార్టీ శ్రేణులంతా ధైర్యంగా ఉండాలనీ, టీడీపీ వారికి అండగా ఉంటుందని చంద్రబాబు అన్నారు. అనంతరం కారులో అనంతపురం పర్యటనకు వెళ్లారు.