ఈ నెల 10 తర్వాత రాజధాని రైతుల విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటాం!: నారా లోకేశ్
- రాజధానిపై సీఎం జగన్ ఇంకా స్పష్టత ఇవ్వలేదు
- మేం చేపట్టిన పనులపై సబ్ కమిటీ వేశారు
- ఏసీ రూముల్లో ఉండి మాపై విమర్శలు చేస్తున్నారు
- గుంటూరులో మీడియాతో ముచ్చటించిన నారా లోకేశ్
ఏపీ ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే ఈ నెల 10 తర్వాత రాజధాని రైతుల విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. అంతకుముందు ట్విట్టర్ లో లోకేశ్ స్పందిస్తూ.. సీఎం జగన్ అబద్ధాలు చెబుతున్నారనీ, అందుకు భారీగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు.