ఇండోనేషియాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- రిక్టర్ స్కేలుపై 7.1గా తీవ్రత నమోదు
- ప్రాణభయంతో పరుగులు తీసిన ప్రజలు
- 8 నగరాలకు సునామీ హెచ్చరికలు
భూకంపం కారణంగా టెర్నెటే నగరంలో ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఎత్తైన ప్రదేశాలకు చేరుకున్నారు. నగరంలోని కొన్ని ఆసుపత్రులు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఆసుపత్రుల్లోని రోగులను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే, ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి ఎటువంటి సమాచారం లేదు.