తల్లీ నీకో నమస్కారం, ఆ పదాన్ని మరోలా పలకొద్దు... ఓ మహిళా రిపోర్టర్ పై పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ తీవ్ర అసహనం!
- బంగ్లాదేశ్ ను 'బెంగాలీస్' అని పలికిన రిపోర్టర్
- 'బెంగాలీస్' అంటే వివాదం అవుతుందన్న సర్ఫరాజ్
- దయచేసి అలా పలకొద్దంటూ హితవు
"దయచేసి 'బెంగాలీస్' అనే పదాన్ని ఉపయోగించవద్దు. మీరా పదాన్ని 'బంగ్లాదేశ్' అనే పలకాలి. మీరు 'బెంగాలీస్' అని పిలిస్తే సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. 'బంగ్లాదేశ్' ను 'బెంగాలీస్' అంటే అదో పెద్ద వివాదం అవుతుంది, ఎందుకొచ్చిన గొడవ!" అంటూ హితవు పలికాడు. షోయబ్ మాలిక్ తమ జట్టులో అత్యంత సీనియర్ ఆటగాడని, కానీ అతని కెరీర్ లో ఓ వరల్డ్ కప్ లేకపోవడం తీరని లోటు అని సర్ఫరాజ్ పేర్కొన్నాడు. దేశానికి ఎనలేని సేవలు అందించిన షోయబ్ జట్టులో ఉండడాన్ని తామెంతో ఆస్వాదించామని చెప్పాడు.