అబ్బో.. ఇలాంటివి చాలా చూశాం.. హఫీజ్ విషయంలో పాక్ తీరుపై భారత్ స్పందన
- హఫీజ్ సయీద్‌పై 20కిపైగా కేసులు
- గతంలోనూ కేసులు పెట్టి అటకెక్కించారన్న రవీశ్ కుమార్
- అంతర్జాతీయ సమాజాన్ని పాక్ మోసం చేస్తోందని మండిపాటు
పాక్ గతంలోనూ ఇలాంటివి చాలానే చేసిందని అయితే, కేసుల తర్వాత ఏమైందన్నది అందరికీ తెలిసిందేనని అన్నారు. ఆ కేసులన్నీ అటకెక్కాక కానీ ఉగ్రవాదులపై పాక్ వైఖరి ఏంటన్నది తెలిసి రాలేదని పేర్కొన్నారు. ఇలాంటి చిన్నచిన్న కేసులతో ప్రపంచాన్ని మోసం చేయాలని పాక్ ప్రయత్నిస్తోందని రవీశ్ కుమార్ ఆరోపించారు.